ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి జరగనున్న ఏపీ కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 28 తర్వాత కేబినెట్‌లో ఇద్దరికీ స్థానం కల్పించే అవకాశం ఉంది. ఇటీవల విజయవాడకు వచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ తో చంద్రబాబు భేటీ అయిన సందర్భంలో ఈ విషయం ఆయనకు చెప్పారని కానీ తేదీ, ముహూర్తం తొందరలోనే తెలియజేస్తామని ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ఏపీ మంత్రి వర్గంలో మరో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది.
అయితే విస్తఃరణలో బహాగంగా మంత్రి పదవులు ఇచ్చే ఇద్దరిలో ఒకరైనా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మైనారిటీల సమావేశంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆగష్టు 28న గుంటూరు, బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో రాష్ట్ర వ్యాప్త మైనారిటీ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు సందర్భంగా సీఎం మంత్రివర్గంలోకి మైనారిటీ వర్గానికి చెందినా వారిని తీసుకునే విషయాన్ని ప్రకటించడంతోపాటు, ఆ వ్యక్తి ఎవరు ? అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆ పదవి వరించేది పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ అని తెదేపా శ్రేణులు భావిస్తున్నారు.