Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ ఎంపీలను లోక్సభ స్పీకర్ సిబ్బంది తప్పుదారి పట్టించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో రోజు చేస్తున్న నిరసనలు ఈ రోజు చివరి రోజు కావడంతో క్లైమక్స్ కి చేరాయి. అయితే సభ చివరి రోజయిన ఈరోజు సభలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజూలానే లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేసి వెళ్లిపోయారు. లోక్ సభ నిరవదిక వాయిదా పడడంతో ఏపీ తెలుగుదేశం ఎంపీలు సభలోనే ఆందోళనకి దిగారు, ప్రధాని కూర్చునే సీట్ ముందు నెల మీద భైఠాయించి నినాదాలు చేశారు.
ఈరోజు మొత్తం అలానే లోపల ఉండి తమ నిరశన తెలుపుదాం అనుకున్నారు అయితే వీరిని ఎలా బయటికి పంపాలా అని ఆలోచించిన లోక్ సభ సిబ్బంది స్పీకర్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పడంతో తెలుగుదేశం ఎంపీలు స్పీకర్ కార్యాలయం వద్దకి వెళ్ళడానికి బయటకి రాగానే సిబ్బంది లోక్సభ తలుపులను మూసివేశారు. ఎంపీలు బయటకు రాగానే వెంటనే వారిని కలవకుండానే స్పీకర్ సుమిత్రీమహాజన్ కార్యాలయం నుంచి తన నివాస గృహానికి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్ కార్యాలయ సిబ్బంది తప్పుదారి పట్టించిన తీరుకు నిరసనగా లోక్సభ స్పీకర్ ఆఫీసు ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. కాసేపటికి లోపలికి సుమిత్రా మహాజన్ కార్యాలయంలో బైటాయించారు. మాగంటి బాబు ఏకంగా నేలపై పడుకుని మరీ నిరసన తెలపడం గమనార్హం