Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగుదేశం నుంచి గతంలో ఎంపీలు వలస వెళ్లేవారు. కానీ ఇఫ్పుడు విచిత్రంగా ఎమ్మెల్సీలు పక్కచూపులు చూస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికల నోటిఫికేషన్ కు కొద్ది నెలల ముందే శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీ చేశారు చంద్రబాబు. కానీ ఆయన మాత్రం బాబుకు హ్యాండిచ్చి వైసీపీలో చేరిపోయారు. అదేమంటే తన అన్నతో ఉంటానని బిల్డప్ ఇచ్చారు.
ఇప్పుడు మరో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఆనడం లేదట. టీడీపీలో ముప్ఫై ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని పక్కనపెట్టి.. కప్పదాట్లకు పదవులిస్తే.. వారు ఇంకా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పక్క పార్టీల వైపు చూడటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు నేతలు బాబును తప్పుదారి పట్టించి ఇలాంటి వారికి సీట్లిప్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంద్రబాబు స్కెచ్ కూడా పక్కాగానే ఉంది. ఇలాంటివారికి ఎమ్మెల్సీ పదవులిచ్చి.. వాళ్లు అయినా పక్క పార్టీలోకి వెళితే.. ఆ సాకుతో అందర్నీ ఏకేయాలని, తర్వాత తీరిగ్గా టీడీపీ వారికి పదవులిచ్చుకోవచ్చలేనిద బాబు ప్లాన్. ఇంతవరకూ బాగానే ఉన్నా నంద్యాల ఉపఎన్నికల ఫలితాన్ని బట్టి మరికొందరు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. కానీ నంద్యాలలో పరిస్థితులు చూస్తుంటే.. టీడీపీ గెలుపు నల్లేరుపై నడక లాగే ఉంది.
మరిన్ని వార్తలు: