ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్ట్ చుట్టూ రచ్చ జరుగుతోంది. స్కిల్ స్కాం అంశాన్ని అజెండాలో ఏపీ ప్రభుత్వం స్వల్ప కాలిక చర్చలో పెట్టింది . అయితే.. చంద్రబాబుపై కేసు ఎత్తేయకుండా చర్చ ఏంటి అని టీడీపీ పార్టీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు . చంద్రబాబు అరెస్టు ఎత్తేయాలని వాయిదా తీర్మానం పై టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.
అంతేకాదు.. నిన్నటి లాగే.. స్పీకర్ పోడియం ఎక్కి ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు . దీంతో సభను 10 నిమిషాల పాటు స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు. ఇక అటు టీడీపీ సభ్యుల వాదనపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సరైన ఫార్మాట్ లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని.. చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు..రచ్చ… శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలేనేదే టీడీపీ ఉద్ధేశం అని ఆగ్రహించారు.