వేడి వేడిగా కాచిన ‘టీ’ ని తాగడం వలన అనేక మందిలో పునరుత్తేజం వస్తుంది. అందుకోసమే అలసట, టెన్షన్ ఉంటే చాలా మంది ‘టీ’ ని ప్రిఫర్ చేస్తారు. ‘టీ’ తాగడం వలన ఎనర్జీ రీ గెయిన్ అవుతుందని చెబుతారు. ‘టీ’ తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని అనేక సైంటిఫిక్ రీసెర్చిల ద్వారా రుజువైంది. మానవ శరీరానికి హానికారకాలైన క్యాన్సర్, ఊబకాయం లాంటి సమస్యలను ‘టీ’ మన దరి చేరకుండా చేస్తుందని పలువురు చెప్పడంతో పాటు అనేక పరిశోధనలు కూడా తెలియజేశాయి.
బ్లాక్ ‘టీ’ అనేది ఇండియాలో చాలా కామన్ గా తాగుతూ ఉంటారు. ఈ ‘టీ’ ని ఉదయం పూట తీసుకుంటారు. బ్లాక్ ‘టీ’ ని ప్రతి రోజు తీసుకోవడం వలన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. కేవలం గుండెకు మాత్రమే కాకుండా బాడీ పెయిన్స్ ను కూడా ఈ ‘టీ’ తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నా బ్లాక్ ‘టీ’ ని తాగితే ఇట్టే తగ్గిపోతుంది. బ్లాక్ ‘టీ’ తో మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయి.
మనలో డీహైడ్రేషన్ సమస్య ఉన్నా కూడా ‘టీ’ తాగడం వలన తగ్గించుకోవచ్చు. ‘టీ’ తాగడం వలన మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయని రుజువైంది. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ‘టీ’ తాగినా కూడా మంచిదేనని పరిశోధనలు వెల్లడించాయి. మనం తరుచూ నీటిని తీసుకునే బదులు ‘టీ’ తాగడం చాలా మంచిదట. ఆక్సిడేషన్ వలన మన బాడీకి కలిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.
మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది లెమన్ ‘టీ’ తాగేందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ లెమన్ ‘టీ’ని తాగడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి… ఎటువంటి వ్యాధులు కూడా మన దరి చేరకుండా ఉంటాయని అందరూ నమ్ముతారు. అందుకోసమే కరోనా కంగారు పెడుతున్న సమయంలో ఎక్కువ మంది లెమన్ ‘టీ’ తాగేందుకు మొగ్గు చూపారు. ఈ ‘టీ’ ని తాగి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. ఈ లెమన్ ‘టీ’ ని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలున్నాయి.
ఈ ‘టీ’ ని తరుచూ తీసుకోవడం వలన కాలేయం, గుండె, చర్మానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ‘టీ’ లో పుదీనా, దాల్చిన చెక్క పొడిని కూడా కొంత మంది మిక్స్ చేసుకుంటారు. వీటిని కలపడం వలన ‘టీ’ కి మరింత రుచి చిక్కదనం వస్తాయి. వీటిని కలుపుకుని తాగడం వలన రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ లెమన్ ‘టీ’ లో ఉన్న అనేక రకాల యాంటి ఆక్సిడెంట్ల వలన మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. అందుకోసమే చాలా మంది లెమన్ ‘టీ’ తాగేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా కరోనా భయానక పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ శాతం మంది లెమన్ ‘టీ’ తాగడం అలవాటు చేసుకున్నారు.
‘టీ’ లలో ఉన్న రకాలలో ఏలకుల ‘టీ’ కూడా ఒక రకమైనది. ఈ రకం ‘టీ’ ని ఎక్కువగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మనం చూడవచ్చు. ఈ ‘టీ’ ని తాగడం వలన జీర్ణసంబంధిత వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అంతే కాకుండా ఏలకుల ‘టీ’ ని తాగడం వలన అధిక పొట్టను కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఏలకుల ‘టీ’ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ‘టీ’ ని తాగడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ‘టీ’ తాగితే దగ్గు, మరియు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా రక్తపోటును కూడా ఈ ‘టీ’ అదుపులో ఉంచుతుంది. ఈ ‘టీ’ మన శరీరంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ ‘టీ’ సహకరిస్తుంది.
జనాలు ఇష్టపడే మరో రకం ‘టీ’ మసాల ‘టీ’. ఈ ‘టీ’ ని మన దేశంలోని వివిధ ప్రాంతాల వారు అమితంగా ఇష్టపడతారు. జనాలు ఎంతలా మసాల ‘టీ’ ని ఇష్టపడతారో… అన్ని రకాల ప్రయోజనాలు ఈ ‘టీ’ వలన కలుగుతాయి. ఇది మైమరిపించే రంగు, రుచిని కలిగి ఉంటుంది. తరుచూ మసాల ‘టీ’ ని తీసుకోవడం మూలాన చాలా రకాల అనారోగ్యాల బారి నుంచి కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఈ మసాల ‘టీ’ తో శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు వీలు పడుతుంది. పేరులో ఉన్నట్లుగా ఈ ‘టీ’ ని వివిధ రకాల మసాలాలతో తయారు చేస్తారు. మసాలాలు మాత్రమే కాకుండా ఈ ‘టీ’ లో భారతదేశంలో విరివిగా లభించే సుగంధ ద్రవ్యాలను కూడా వాడుతారు.
ఈ ‘టీ’ లో ముఖ్యంగా అల్లం, ఏలకులు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్కలను వాడుతారు. మనలో ఎటువంటి జీర్ణసమస్యలు, కడుపులో మంటగా ఉన్నా సరే ఈ మసాల ‘టీ’ ని తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. మంట నుంచి ఉపశమనం అందిచడమే కాకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. కానీ వేడి ప్రదేశాల్లో ఉన్నపుడు మసాల ‘టీ’ ని తీసుకునే వారు మాత్రం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వేడి ప్రాంతాల్లో మసాల ‘టీ’ ని అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. కనుక వేడి ప్రదేశాల్లో ఉన్న వారు కేవలం రోజుకు రెండు కప్పుల చొప్పున మాత్రమే మసాల ‘టీ’ ని తీసుకోవాలి.
క్రమం తప్పకుండా రోజు ‘టీ’ ని తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇలా తరుచూ ‘టీ’ ని తీసుకోవడం వలన మనలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతే కాకుండా నరాల సంబంధిత వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి. చాలా పరిశోధనల్లో తరుచూ ‘టీ’ ని తీసుకోవడం వలన అల్జీమర్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు తగ్గుతాయని తేలింది. గ్రీన్ మరియు బ్లాక్ ‘టీ’ లను తీసుకోవడం వలన అల్జీమర్స్ రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధనలతో పాటు అనేక మంది వైద్యులు కూడా తెలిపారు. ‘టీ’ తాగడం వలన మనలో ఉన్న జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
మనం తాగే ‘టీ’ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో అనేక రకాల ‘టీ’ లు చాలా ఫేమస్. ఇలా రకరకాల ‘టీ’ లకు దేని సువాసన, పరిమళాలు దానికే ఉన్నాయి. కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఫేమస్ అయిన ‘టీ’ లలో ఏది తాగినా సరే మనసు చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. వీటిల్లో వేటి రుచి, చిక్కదనం వాటికే ఉంటుంది. అంతే కాకుండా ఈ ‘టీ’ ల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో లభించే ‘టీ’ లలో ఏ రకం ‘టీ’ ఉత్తమమైనదని అడిగితే చెప్పడం చాలా కష్టం.
కానీ చాలా మంది బ్లాక్ ‘టీ’ ని తాగడం వలన మనసు చాలా ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు. ఈ బ్లాక్ ‘టీ’ ని తయారు చేయడం కూడా చాలా తేలిక.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజలు ‘టీ’ ని ఒక రకమైన రిఫ్రెషింగ్ సాధనంగా చూస్తారు. ఇది మనసు ఉత్తేజపరిచే వేడి పదార్థం. మనం చాలా రకాల ‘టీ’ లను చూసి ఉన్నప్పటికీ అన్ని రకాల ‘టీ’ లు మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ‘టీ’ తాగడం వలన మనల్ని మనం అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, హార్ట్ అటాక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా ‘టీ’ మనల్ని కాపాడుతుంది.
తరుచూ ‘టీ’ తాగడం వలన మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటికే చాలా పరిశోధనలు ప్రూవ్ చేశాయి. కావున ‘టీ’ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని శాస్త్రీయంగా కూడా రుజువైంది కాబట్టి ‘టీ’ ని తీసుకోవచ్చు. ఎక్కువగా ‘టీ’ ని తాగడం వలన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందా? అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ‘టీ’ తాగడం వలన అటువంటి సమస్యలేవీ రావని పరిశోధనల్లో కూడా తేటతెల్లమైంది కావున ‘టీ’ ని తరుచూ తీసుకోవచ్చు.