తేజస్వి, సామ్రాట్ల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని తెలుగు బిగ్‌బాస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఇంట్లో కలిసి పోయారో, ఇంట్లో ఎందరు ఉన్నా కూడా వీరిద్దరు ఎంతగా మాట్లాడుకునే వారో అందరికి తెలుసు. తేజస్వి ఎలిమినేషన్ సమయంలో సామ్రాట్ తీవ్రంగా భావోద్వేగానికి లోనైన విషయం తెల్సిందే. ఇక తేజస్వి కూడా సామ్రాట్‌ను వదిలేసి వెళ్తున్నందుకు చాలా ఫీల్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారేమో అన్నంతగా వీరి రొమాన్స్ బిగ్‌బాస్ ఇంట్లో కొనసాగింది. అయితే తేజస్వి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చేసింది. ఇంట్లో ఉన్న సమయంలో తాను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చిన తేజూ ఇప్పుడు మాత్రం తమ మద్య ప్రేమ గీతా ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన తేజస్వి… సామ్రాట్ ఒక మంచి వ్యక్తి అని, ఆయన నాకు మంచి స్నేహితుడు. నేను ఇంట్లో ఉన్న సమయంలో అరచి గీ పెట్టి, ఇతరుల గురించి గొడవ పడటం మాత్రమే చూపించారు. సామ్రాట్‌ను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడైనా సామ్రాట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు ఎక్కువగా చూపించాలని కోరుతున్నారు. సామ్రాట్‌తో పాటు తనీష్ కూడా తనకు మంచి స్నేహితుడు అయ్యాడు అని, ఇద్దరు కూడా మంచి వ్యక్తులు అవ్వడం వల్ల ఒక గ్రూప్‌గా అయ్యాం తప్ప, మరే కారణం లేదని, సామ్రాట్‌తో ప్రేమ వ్యవహారం అస్సలు లేదని క్లారిటీ ఇచ్చింది. మొన్నటి వరకు ఇంట్లో సామ్రాట్‌తో రాసుకు పూసుకు తిరిగిన తేజస్వి ఉన్నట్లుండి ఎందుకు ఇలా మారిపోయిందా అని అంతా కూడా అవాక్కవుతున్నారు. ఇదే విషయం సామ్రాట్‌తో తేజస్వి చెబితే ఎలా ఉంటుందో అని కొందరు ఎదురు చూస్తున్నారు. తనకు మళ్లీ బిగ్‌బాస్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉంది, దయచేసి తనకు ఓట్లు వేయాలని ప్రేక్షకులను తేజస్వి కోరింది.