Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన ప్రమేయంతోనే ప్రాజెక్టులపై జీఎస్టీ పన్ను రేటు 28 శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గిందన్న కేసీఆర్.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి జీఎస్టీతో రాష్ట్రాలకు నష్టమని డ్రామా చేస్తున్నారని తెలంగాణ బీజేపీ మండిపడుతోంది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలన్నీ తన ఘనత.. వ్యతిరేక నిర్ణయం వస్తే రాష్ట్ర బీజేపీకి అంటగట్టడం కేసీఆర్ పాలనలో అసలు లాజిక్కని నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
కేసీఆర్ ఏం విధానం పాటిస్తారో ఆయనకే క్లారిటీ లేదని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎందుకు పట్టించుకోవాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ తో అంటకాగి, ఎన్నికల ముందు టోన్ మార్చిన కేసీఆర్.. జనం చెవ్విలో పువ్వులు పెట్టారని, ఇప్పుడూ అదే పద్ధతిలో వెళ్తున్నారని మండిపడ్డారు. కానీ కేసీఆర్ మాయలకు జనం ఫ్లాటయ్యే రోజులు పోయాయన్నారు.
ఎన్నికల ముందు బీజేపీ ఎదగకుండా చూసేందుకు. తెలంగాణ జనాన్ని మరోసారి మోసం చేయడానికే కీసఆర్ పాట్లు పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ పద్ధతి చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా ఉందన్నారు. జీఎస్టీ కౌన్సిల్ లో లేవనెత్తే అవకాశం ఉన్నా న్యాయపోరాటం అదీ, ఇదీ అంటూ సీఎం జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు కాషాయ నేతలు.
మరిన్ని వార్తలు: