తెలంగాణా సీఎం కేసీఆర్ ఈరోజు కేబినెట్ సహచరులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అందరూ అందుబాటులో ఉండాలంటూ మంత్రులకు సమాచారం వెళ్లింది. బక్రీద్ పండుగకు సొంత జిల్లాలకు వెళ్లిన మంత్రులు వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంత అత్యవసరంగా మంత్రులను పిలిపించుకుంటున్న కేసీఆర్ ఇవాళ ఏం చేయబోతున్నారు? రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటారా? అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రస్నార్ధకంగా మారాయి.
సాధారణంగా మంత్రివర్గ సమావేశం అంటే ముందస్తుగానే ఎజెండా ఫిక్స్ చేసి సమాచారం చేస్తారు. కానీ ఈ సారి సడన్ భేటీ కావడంతో మంత్రులకు కూడా అర్థం కావడం లేదు. ఈనెల 13న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికల మీద కొన్ని లీక్ లు ఇస్తూనే సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడు అవే అంశాల మీద చర్చ ఉంటుందా లేక మరెకేమైనా విషయాల మీద సమావేశం జరగనుండా అనేది ప్రస్నార్ధకంగా మారింది.
ఎన్నికలకు సమరశంఖం పూరించే క్రమంలో సెప్టెంబర్ 2న భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన జనసమీకరణ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల వల్ల సభ ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీని మీదనే కేబినెట్ జరగనుందని సమాచారం. సెప్టెంబర్‌లోనే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పడం, రాహుల్ ఇచ్చిన హామీల మీద సాధ్యాసాధ్యాలు చర్చించేందుకే ఈ భేటీ అని తెలుస్తోంది.