తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం వెళ్తూ విశాఖలో శారదా పీఠాన్ని సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత పర్యటన రాజకీయాలకు సంబంధం లేదు. కానీ ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే కేసీఆర్ విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠం వెళ్లి ఆ తర్వాత మళ్లీ భువనేశ్వర్ బయలుదేరే వరకూ కేసీఆర్కు భద్రతను తెలంగాణ పోలీసులే కల్పించారు. ప్రత్యేకంగా కేసీఆర్ భద్రత కోసం బస్సుల్లో పోలీసుల్ని రెండు రోజుల ముందే విశాఖకు తరలించారు. శారదాపీటం చుట్టుపక్కల మొత్తం తెలంగాణ పోలీసులే భద్రతను పర్యవేక్షించారు. ఏపీ పోలీసులు తమ విధిగా తాము బందోబస్తు నిర్వహించారు కానీ అసలు భద్రత మాత్రం తెలంగాణ పోలీసులే చూసుకున్నారు. అయితే భువనేశ్వర్ లో మాత్రం తెలంగాణ పోలీసులు భద్రత కల్పించ లేదు. అక్కడి పోలీసులే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ భువనేశ్వర్ పయనమైన తర్వాత తెలంగాణ పోలీసులు హైదరాబాద్ కు పయనమయ్యారు. ఒడిషాలో లేని సెక్యూరిటీ భయం కేసీఆర్కు విశాఖలో ఎందుకొచ్చిందన్నదే అసలు ప్రశ్న. ఏపీ లో తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఫోన్లు పగిలిపోయేంతగా మెసెజులు వస్తున్నాయని చెప్పుకున్న కేసీఆర్ కు ఏపీ అంటే అంత భయమెందుకో ? ఆయనకు ఏపీ ప్రజలంటే భయమా ఏపీ పోలీసులంటే నమ్మకం లేదా ? అంతకు మందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు విశాఖ పర్యటనకూ వచ్చారు. అప్పటి స్వాగతానికి ఇప్పటి స్వాగతానికి ఆయనకు తేడా తెలిసి ఉంటుంది. అప్పట్లో ఆయన సొంత పోలీసులను రక్షణగా ఏర్పాటు చేసుకుని రాలేదు. ఒంటరిగా వచ్చారు, ఆతిథ్యాన్ని పొందారు. అతిధిగా వచ్చారు కాబట్టి ప్రజల అదే రీతిలో అభినందించారు. కానీ ఇప్పుడు విశాఖలో ఏం జరిగింది. హైదరాబాద్లో వ్యాపార ప్రయోజనాలు కోరుకునే కొంత మంది పని గట్టుకుని యాడ్ ఏజెన్సీలతో మాట్లాడుకుని మరీ ఫ్లెక్సీలు పెట్టాల్సి వచ్చింది. ఆ ఫ్లెక్సీలు కూడా ఎయిర్ పోర్ట్ టు శారదాపీఠం అంతే. కొంత మంది ఇతర పార్టీల స్థానిక నేతలతో.. కొంత మందిని ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి ఘన స్వాగతం బలవంతంగా ఇప్పించగలిగారు. జై కేసీఆర్ నినాదాలు చేయించగలిగారు. కానీ ఆ నినాదాలు మొత్తం పెయిడేనని వచ్చిన వారి వ్యవహారశైలి చూస్తనే తెలిసిపోతుంది. కేసీఆర్ గతంలో ఏపీ పర్యటనకు వచ్చిప్పుడు.. టీడీపీతో వైరంలేదు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో అప్పట్లో కేసీఆర్ ఏపీకి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చూపించారు. కానీ నిన్న విశాఖకు వచ్చినప్పుడు గతంలో వచ్చినప్పుడు వచ్చిన రియాక్షన్కు ఇప్పటి రియాక్షన్కు తేడా తెలిసి వచ్చింది. పరిటాల రవి కుమార్తె పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనతో మాట్లాడేందుకు ఏపీ నేతలు పోటీలు పడ్డారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖం చూపించడానికి ఇష్టపడలేదు. చివరికి భద్రత కోసం పోలీసుల్ని తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణాలో సేటిలయిన ఆంధ్రా జనం మీద ఆయన వెళ్ళగక్కిన ఆక్రోశం అలాంటిది మరి.