Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రిపబ్లిక్ డే ప్రసంగంలో ఆమ్రపాలి వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆమ్రపాలిపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఎస్పీసింగ్ తో ఆమ్రపాలి అన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమ్రపాలి అకారణంగా నవ్వడం, సంబంధింత అంశాలకు సంబంధించిన గణాంకాలు ప్రకటించేటప్పుడు తడబడడం చేశారు. అంతటితో ఆగకుండా ప్రసంగం మధ్యలోవెనుతిరిగి ఇట్స్ ఫన్నీ అని వ్యాఖ్యానించారు. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమ్రపాలి తీరును పలువురు ఆక్షేపించారు. కలెక్టర్ తన స్థాయిని మరిచి ప్రవర్తించారని మండిపడ్డారు.