ఆడ బిడ్డలకి తెలంగాణ సర్కార్ “బతుకమ్మ” చీరల పంపిణి

ఆడ బిడ్డలకి తెలంగాణ సర్కార్

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణి చేస్తున్నాం అని మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నల్గొండలో చీరల పంపిణి చేస్తూ కోటి మందికి ఈ పండగ చిరుకానుక అందివ్వాలన్నదే కెసిఆర్ కోరిక అని కేటీఆర్ అన్నారు. ఈ చీరలు పంపిణి కార్యక్రమం లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటుంటున్నారు.

సిరిసిల్లలోని నేత కార్మికులు వీటిని రూపొందించారు. గత ఏడాదిలా కాకుండా 10 లక్షల చీరలు 9 మీటర్లు, మిగతా 90 లక్షలు చీరలు 6 మీటర్ల సైజులో తయారు చేయించినట్లు చెప్పారు. దాదాపుగా వంద రకాల చేరాలను పంపిణి చేస్తున్నారు.

సిద్దిపేటలో చీరాల పంపిణి చేస్తూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న ఇలాంటి పథకాలు ఆగవు అని మంత్రి హరీష్ రావు
స్పష్టం చేసారు.

పంపిణి రోజే ఇరవై లక్షల చీరల పంపిణి జరిగింది.ఇంకా వేగంగా ఊరువాడా ఈ పంపిణి జరిగేలా ప్రభుత్వం చూస్తుంది. మరింత ప్రోత్సాహం ఉండేలా ఈ సారి ఈ చీరల తయారీ సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు బతుకమ్మ చీరల మీద ప్రభుత్వం రూ.715 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.