Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ లా.. ఇక కరెంట్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇకపై మీటర్ల స్థానంలో స్వైపింగ్ యంత్రాలు బిగించనుంది ట్రాన్స్ కో. అప్పుడైతే బిల్లులు కరెక్టుగా వసూలౌతాయని, ఎగ్గొట్టే వీలుండదని చెప్పుకొస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికాలో ఈ విషయంపై అధ్యయనం చేశామని, ఇక ఇక్కడ కూడా అమలు చేస్తామంటోంది తెలంగాణ విద్యుత్ సంస్థ.
అటు కేసీఆర్ కూడా ఈ పద్ధతికి సానుకూలంగానే ఉన్నారట. ఇదేదో బాగానే ఉందని, డబ్బులు కరెక్టుగా వస్తాయి కాబట్టి విద్యుత్ సంస్థలకు బాథ లేదు. పైగా వినియోగదారులు కూడా ప్రీపెయిడ్ కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటారనే అభిప్రాయం ఉంది.ఇది రెండు వైపులా ఉపయోగకరమేనని చెప్పుకుంటున్నారు. ఈ దెబ్బతో సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ చేయించాల్సిన అవసరం ఉండదు.
ప్రీపెయిడ్ కరెంట్ ప్రతిపాదన అమలైతే ఇక ఏపీలో కూడా ఇది షురూ అవడం ఖాయం. మరోవైపు ఈ విధానం అంత సేఫ్ కాదని, అదే నిజమైతే చాలా దేశాలు అమలు చేసేవనే వాదన కూడా ఉంది. కానీ ఏదైనా ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుత విధానంలో బిల్లు కట్టడానికి కొంత టైముంటుందని, కానీ సడెన్ గా వినియోగదారుల దగ్గర డబ్బుల్లేక రీఛార్జ్ చేయించుకోకపోతే కరెంట్ పోతే వ్యతిరేకత వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలు: