Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా ఇంటర్ అయిపోగానే విద్యార్థులంతా ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు చూస్తారు. ఎంసెట్ లో ర్యాంక్ ఎక్కువొచ్చినా, సీటు రాకపోయనా అల్టర్టేటివ్ గా డిగ్రీలో చేరతారు. ఇప్పుడు డిగ్రీకి కూడా ఇంజినీరింగ్ లాగా సవాలక్ష రూల్స్ పెడితే అసలుకే ఎసరు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ చాలా చిత్రంగా ఉన్నాయిలెండి.
డిగ్రీకి 75 శాతం అటెండెన్స్ ఉండాలని, ప్రతి సెమిస్టర్లో కనీసం 50 శాతం మార్కులు రావాలని నిబంధనలు పెట్టడం డిగ్రీ విద్య ఉద్దేశాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. ఇప్పటికే కొన్ని పేరున్న డిగ్రీ కాలేజీల్లో ఈ నిబంధనలు అనధికారికంగా అమల్లో ఉన్నాయి. బాగా చదవాలనుకునే వాళ్లు ఇలాంటి కాలేజీల్లో చేరి చదువుకుంటారు. కానీ సర్కారు పనిగట్టుకుని అన్ని కాలేజీలకు వర్తింపజేయడమే తంటాగా మారింది.
డిగ్రీ చదివితే జాబ్ గ్యారెంటీ ఉందా… లేదు. కనీసం ఇంజినీర్లకూ ఉద్యోగాలు ఇప్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు వాళ్ల మానాన వాళ్లను వదిలేయక ఎక్స్ ట్రాలు ఎందుకు చేస్తున్నారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఏదో డిగ్రీ కోసం డిగ్రీ చదువుతారు కానీ… జ్ఞాన సముపార్జన కోసం కాదని సర్కారుకు ఎప్పుడు అర్థమవుతుందో.
మరిన్ని వార్తలు: