చింతమడక గ్రామానికి రూ.10కోట్లు మంజూరు

telangana govt released funds to chinthamadaka

తెలంగాణ ప్రభుత్వం చింతమడక గ్రామానికి రూ.10కోట్లు మంజూరు చేసింది. చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గ్రామానికి ప్రత్యేక నిధులు విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.10కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు ఇప్ప‌టికే పూర్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చింతమడక గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.