సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ “చలో ప్రగతి భవన్” వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడించింది. పోలీసులు ఎక్కడి అక్కడ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీస్కుని అరెస్ట్ లు చేసారు.
పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి బైక్పై ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ను ప్రగతి భవన్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి కోరారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తెలంగాణ యావత్ ప్రజలు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పారు.