సీఎం రేసులో దూసుకెళ్తున్న రేవంత్…!

Telangana Revanth Reddy Election Campaign

తెలంగాణ రాజకీయాలలో కెసిఆర్ తో పెట్టుకునే దమ్మున్నోడు రేవంత్ రెడ్డి మాత్రమే ఇందులో నో డౌట్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే కేసీఆర్ కు దీటుగా సమాధానం చెప్పి, తొడగొట్టి మరీ సవాల్ చెయ్యగల ధైర్యం ఉన్నోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్, రేవంత్ రెడ్డి ల మధ్య మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. 2014 ఎలక్షన్స్ లో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో భయపెట్టి టిఆర్ఎస్ లో చేరేటట్టు చేసాడు కెసిఆర్. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరి దొరకు సలాం చేస్తూ గులాం అయిపోయారు. అయితే ఏం చేసినా సరే పార్టీ మారనన్న ఒక్కడు కేసీఆర్ పక్కాగా ప్లాన్ చేసిన ఓటుకు నోటు కేసులో ఇరికించినా నీ చేతనైంది చేసుకో అన్న రేవంత్ రెడ్డి మాత్రమే. అందుకే ఆయన మాట తీరు, ధైర్యం కేసీఆర్ కు అసలే నచ్చదు. అందుకే ఓటుకు నోటుతో కెసిఆర్ రాజకీయంగా రేవంత్ పై పెద్ద దుమారమే రేపి రేవంత్ ని జైలుకి కూడా పంపించాడు.

Revanth Reddy Controversial Comments On KCR

అయితే తెలంగాణలో జరుగుతున్నా రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. అది కూడా తెలుగుదేశం అధినేత స్కెచ్ అనే చెబుతారు విశ్లేషకులు. దానికి తగ్గట్టే పార్టీ మారినా తాను అంతకాలం ఉన్న టీడీపీ పై ఎప్పుడూ నోరు జారలేదు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకుగా ఉంటూ బలమైన నేతగా ఎదిగాడు. కాంగ్రెస్ లో బలమైన నాయకులూ ఉన్న, రేవంత్ పేరు వస్తే చాలు ఇటు ఆయన అభిమానులు అటు ఓటర్లు ఉత్సాహంతో ముందుకు వస్తారు. అయితే ఒక రేవంత్ రెడ్డి కె నాయకులందరినీ ఒక తాటిమీదకి తెచ్చే సామర్థ్యం ఉందని, కెసిఆర్ ను కూడా దీటుగా ఎదుర్కునే నాయకుడు ఆయనేనని పార్టీ పెద్దలు కూడా విశ్వసిస్తున్నారు. అందుకే ఢిల్లీలో రేవంత్ గురించి చెప్పేవారు ఎవరూ లేకపోయినా మరో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేస్తున్నా రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీలో రావాల్సిన పేరు వస్తోంది. రెండు రోజుల కిందట ఆయన నామినేషన్ కార్యక్రమానికి యాభై వేలమందితో ర్యాలీగా రావడం దేశంలోనే హాట్ టాపిక్ అయింది. ఓ భారీ బహిరంగసభకు వచ్చిటనట్లు కొడంగల్ ప్రజలు తరలి రావడం హాట్ టాపిక్ అయింది. దీనిపై ప్రధాన మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

 

revanth

దీంతో సభల నిర్వహణలో రేవంత్ పనితనం మెచ్చిన రాహుల్ గాంధీ ఇరవై మూడో తేదీన మేడ్చల్ సభ బాధ్యతలను కూడా రేవంత్‌కే అప్పగించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తనకు ఓ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సూచనలు లేకపోయినా తన బలాన్ని రాహుల్ ముందు ప్రదర్శించాలని ఆయన అనుకున్నారు. రాహుల్ అనుమతి ఇచ్చినా తెలంగాణ నేతల దగ్గరే ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఆ తర్వాత రాహుల్ రెండు సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఓ సారి రెండు రోజులు మరో సారి ఇటీవల ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వరుసగా మూడు సభల్లో పాల్గొన్నారు. ఆయా సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందనను.. రాహుల్ గాంధీ చూశారు. సహజంగానే తనకు వచ్చే ఏ పార్టీకి కొమ్ముకాయని ఇండిపెండెంట్ సంస్థల నివేదికలతో ఆయన ఎవరి సామర్థ్యం ఏమిటో అంచనా వేసుకుంటున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ సభ నిర్వహణ బాధ్యతలు చూసే అవకాశం రావడంతో రేవంత్ రెడ్డి తన పూర్తి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. అధినేత్రి ముందు తన సామర్థ్యాన్ని నిరూపించుకుని శభాష్ అనిపించుకుంటే ముందు ముందు పనికివస్తుందని ఆయాన భావిస్తున్నారు. అయితే సభ జరిగి సక్సెస్ అయ్యి తర్వాత కూటమి అధికారంలోకి వస్తే మాత్రం సీఎం రేసులో రేవంత్ మొదటి వరుసలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో ?

trs-congress