బిగ్‌బాస్‌ 2లో మూడు కీలక మార్పులు

Telugu bigg boss season 2 be 100 days long

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రపంచ వ్యాప్తంగా అరించిన బిగ్‌బాస్‌ గత సంవత్సరం తెలుగులో కూడా ప్రసారం అయ్యింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 1 కు అనూహ్య స్పందన దక్కింది. బిగ్‌బాస్‌ను తెలుగులో అనగానే పెద్దగా ఆసక్తి కలగలేదు. ఎక్కువ శాతం ప్రేక్షకులు ఎలా ఉంటుందో అంటూ ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ కారణంగానే బిగ్‌బాస్‌ షోను 100 రోజులు కాకుండా 70 రోజులు మాత్రమే ప్లాన్‌ చేశారు. అయితే పక్క రాష్ట్రం తమిళనాడులో మాత్రం 100 రోజులు ఈ షోను రన్‌ చేయడం జరిగింది. ఇక రెండవ సీజన్‌కు స్టార్‌ మాటీవీ సిద్దం అవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సీజన్‌తో పోల్చితే బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో కీలకమైన మూడు మార్పులు కనిపించబోతున్నాయి.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కనిపించబోతున్న మొదటి అతి పెద్ద మార్పు హోస్ట్‌. మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌ రెండవ సీజన్‌కు అందుబాటులో లేడు. దాంతో ఆ స్థానంను నానితో భర్తీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రెండవ మార్పు 70 రోజుల నుండి 100 రోజుకు పెంచారు. ఇలా చేయడం వల్ల పార్టిసిపెంట్స్‌ సంఖ్య పెరగడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుంది. ఇక మూడవ మార్పు ఏంటీ అంటే ఈ సీజన్‌ నుండి సామాన్యులకు కూడా బిగ్‌బాస్‌ ఇంట్లోకి అవకాశం ఇస్తున్నారు. ఈ మూడు మార్పులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మార్పులతో పాటు మరిన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. గత సీజన్‌లో పూణెకు సమీపంలో ఒక ప్రత్యేకమైన భవనంలో బిగ్‌బాస్‌ కార్యక్రమం నిర్వహించారు. కాని సెకండ్‌ సీజన్‌ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్టింగ్‌ను నిర్మించారు. హైదరాబాద్‌లోనే బిగ్‌బాస్‌ షో జరుగబోతుంది.