ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు హర్రర్ మూవీ…!

Telugu horror movie streaming in OTT...!
Telugu horror movie streaming in OTT...!

యువ నటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ సినిమా తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా లో ధనుష్ రఘుముద్రి కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం వాళ్ళు ఆశించిన స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది.

టెంపర్ వంశీ, సలోని, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ని నరేష్ బాబు పి మరియు రవి చైతన్య కలిసి ఫస్ట్ కాపీ మూవీస్, బీ ది వే ఫిలిమ్స్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మించారు.

Telugu horror movie streaming in OTT...!
Telugu horror movie streaming in OTT…!

విషయం ఏమిటంటే, నేటి నుండి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ నుండి ఎంత మేర రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.