స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చూడగలిగే టాప్ చిత్రాలు తెలుగు దేశభక్తి చిత్రాలు

Telugu patriotic movies to watch on independence day
Telugu patriotic movies to watch on independence day

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చూడగలిగే టాప్ చిత్రాలు తెలుగు దేశభక్తి చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..

1ఖడ్గం
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటి, ఖడ్గం చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, బ్రహ్మాజ్ మరియు ఇతరులు వంటి బలమైన తారాగణం ఉంది. కామిడి , ప్రేమ మొదలుకుని దేశభక్తి ఎలా అన్ని ఎన్నో ఎమోషన్స్‌తో సినిమా సాగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మరియు నేపథ్య స్కోర్ ఇప్పటికీ మనకు మదిలో మెదులుతుంది. ఖడ్గం చిత్రం జెమినీ టీవీలో తెలుగు ఇంట్లో ఈ సినిమా లేకుండా ఏ స్వాతంత్ర్య దినోత్సవం గడవదు. . జీవితంలో ఒక్కసారైనా చూసే ఈ సినిమా ఏ ఖడ్గం .
2. జై
తేజ దర్శకత్వంలో నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన జై దేశభక్తి స్పోర్ట్స్ డ్రామా చిత్రం. పాకిస్తానీ బాక్సర్‌తో భారతదేశం కోసం బాక్సింగ్ మ్యాచ్‌ని గెలిపించే కథ ఈ సినిమా చాలా గుర్తుండిపోయే సన్నివేశాలతో నిండి ఉంటుంది, క్లైమాక్స్ వాటన్నింటికంటే కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘దేశం మనధే’ పాట దేశభక్తిని ఉప్పొంగేలా చేస్తుంది, ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాఠశాలల్లో తప్పకుండా ఈ పాట వినిపిస్తుంది.
3. మేజర్
ముంబై దాడుల హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ని . అడివి శేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం మేజర్ . దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ జీవితాన్ని గురించి తెలిపే ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం చూడదగిన చిత్రాల్లో మరొకటి.
4. ఘాజీ
రానా దగ్గుబాటి, తాప్సీ కలిసి నటించిన చిత్రం ఘాజి ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధం యొక్క కథను ఆధారంగా తెరకేక్కిన్చారు
5. , సుభాష్ చంద్రబోస్
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన, సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యానికి పూర్వం,జరిగిన కథగా ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చారు . బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసే పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడు . స్వతంత్ర దినం సందర్బంగా చూడవలసిన చిత్రాల్లో ఏది కూడా ఒకటి
6. అల్లూరి సీతారామరాజు
1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో పురాణ విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు మరియు గిరిజన నాయకుడు మల్లుదొర జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
7. మేజర్ చంద్రకాంత్
ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 1993లో విడుదలైన మేజర్ చంద్రకాంత్, ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి చుట్టూ తిరుగుతుంది.
8. సర్దార్ పాపా రాయుడు
దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980లో వచ్చిన సర్దార్ పాపా రాయుడు చారిత్రక చిత్రం. NT రామారావు-నటించిన ఈ చిత్రం బ్రిటీష్ వారితో చేతులు కలిపి పేదలను దోపిడీ చేసే అవినీతి రాజకీయ నాయకుడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.
9. రోజా
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద దాడుల గురించి ఈ చిత్రం లో చూడవచ్చు. ఈ సినిమా టీవీ లో రాకుండా ఆ స్వతంత్రదినోత్సవం పూర్తి కాదు.