మరోసారి మోడీ బుద్ధి బయట పడింది !

Telugu Skipped From Statue Of Unity Sign Board

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యతా విగ్రహం పేరుతో తన కుబుద్దిని మరోసారి చాటి చెప్పారు. దక్షిణాదిపై ఆయన చూపిస్తున్న వివక్ష మరోసారి స్టాట్యూ ఆప్ యూనిటీ సాక్షిగా బయటపడింది. దేశ ఐక్యతకు చిహ్నంగా ప్రపంచమంతా తెలిసేలా ఆవిష్కరించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మహా విగ్రహ శిలాఫలకంలో తెలుగు భాషకు చోటు లేకుండా పోయింది. పటేల్ విగ్రహ శిలాఫలకంపై దక్షిణాది నుండి తమిళానికి చోటు కల్పించినా అది తప్పు గా తర్జుమా అవడంతోఆవిష్కరణ కార్యక్రమంలో దాన్ని కొట్టివేసి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. పటేల్ విగ్రహ శిలాఫలకంలో దక్షిణాది నుంచి తమిళానికి తప్ప మరే భాషకూ చోటు దక్కలేదు.

Modi

దీంతో దక్షిణాదికి మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగుకు చోటెందుకు లేదంటూ విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగుకు మూడో స్థానం ఉన్నా కావాలనే బీజేపీ పట్టించుకోలేదంటూ తెలుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచంలోని ప్రతీ దేశంలో తెలుగువాళ్లున్నారు. ఎక్కడిక్కడ తెలుగు సంఘాలున్నాయి. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇంత ప్రాముఖ్యమున్నా ఐక్యతా విగ్రహంపై ఇతర భాషలకు చోటు కల్పించి తెలుగుతో పాటు… దక్షిణాధి బాషలను నిర్లక్ష్యం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను రాజకీయం కోసం వాడుకుంటూ ఆయన స్ఫూర్తిని మంట గలిపేశారు మోడీ అండ్ కో.