TG Politics: హైదరాబాద్ మహానగరంలో 11 లక్షల మందికే గృహజ్యోతి..!

TG Politics: 11 lakh people in Hyderabad city have homes..!
TG Politics: 11 lakh people in Hyderabad city have homes..!

రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ పథకం కింద హైదరాబాద్ మహానగరంలో మొదటగా 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరి వివరాలన్నీ సీజీజీకి చేరాయి. మార్చి నెలలో వీరికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానుండగా.. త్వరలో పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంతమందికి వర్తిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజాపాలనలో గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల ధ్రువీకరణ ప్రక్రియ, వివరాల సేకరణను విద్యుత్తు సిబ్బంది బిల్లుల జారీ సమయంలో చేపట్టగా ఇంకా కొనసాగుతోంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటివరకు 30 లక్షల వినియోగదారుల వివరాలను పరిశీలన పూర్తి చేసి పథకం అమలు కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కి సమర్పించారు. ఇందులో సిటీకి చెందిన వినియోగదారులు 11 లక్షల వరకు ఉన్నారు. ఆహారభద్రత కార్డు తప్పనిసరి అనడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను బట్టి వీరి శాతం తగ్గొచ్చు లేదంటే పెరగొచ్చు.