తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలను BRS బయటపెట్టింది. తెలంగాణలో మరణించిన 209 రైతుల వివరాలు తనకు ఇవ్వాలని నిన్న పేర్కొన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక, సమయానికి రైతుబంధు అందక, పాము కాట్లతో, అర్థరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో, సాగునీళ్లు ఇవ్వక, కరెంట్ కోతలతో మరియు అధికారుల వేధింపులతో మరణించిన 209 రైతుల వివరాలు ఈ మీడియా సంస్థ బయటపెట్టిందని BRS పార్టీ పోస్ట్ పెట్టింది.
ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం, దురదృష్టవశాత్తు మరణించిన ఈ 209 రైతుల యొక్క కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఒక్కో రైతు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని BRS పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని వివరించింది.