కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 8 స్థానాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలు పెండింగ్ లో పెట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఆ స్థానాల్లో ఆశావహులు ఎక్కువ ఉన్నందున అభ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆలస్యం కానుంది.
ఇది ఇలా ఉండగా… నాగర్ కర్నూల్ లోకసభ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలని కోరుతూ AICC కార్యదర్శి సంపత్ కుమార్ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మాదిగ ఓట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 17 లక్షల 30 వేల 781 ఉండగా అందులో మాదిగల సంబంధించిన ఓటర్లు మూడు లక్షల 75వేల 532 ఉండగా మాల ఓట్లు కేవలం 62,801 ఉన్నట్లు వివరించారు.
నాగర్ కర్నూలు టికెట్ మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించినట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని AICC కార్యదర్శి సంపత్ కుమార్ ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా కలిగిన దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవి ఉందని, ఖమ్మం నుంచి గెలుపొందిన ఆయన సోదరుడు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.