ఆరూరి రమేష్ ఇంటికి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రమా కొనసాగుతోంది. BRS పార్టీ రాజీనామాకు సిద్ధమై ప్రెస్ పెట్టేందుకు ఆరూరి రమేష్ సిద్ధం అయ్యారు. ఈ తరుణంలోనే… ఆరూరి రమేష్ ఇంటికి BRS ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, BRS నేతలు చేరుకున్నారు.
ఆరూరి రమేష్ ను BRS పార్టీ ఇంకా బుజ్జగిస్తోంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరిని BRS నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. హరీష్ రావు ఆదేశాల మేరకే BRS నేతలు వచ్చామంటున్నారు. ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని BRS నేతలు ఆరూరికి చెబుతున్నారు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.