వాళ్ళ మొహాల్లో వికటాట్టహాసం…కాళ్ళ కింద భూకంపం.

The AP Leaders got Shocked With Chandra Babu Naidu Decision
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“ చెరపకురా చెడేవు “ అన్నది ఎంత పాత సామెత. ఈ సామెత లేటెస్ట్ గా ఇంకోసారి భలే ప్రూవ్ అయ్యింది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గొడుగు కింద అధికారం,పదవులు అనుభవించి ఆ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో చాలా మంది రాజకీయ నిరుద్యోగులు అయ్యారు. వీళ్లంతా కాంగ్రెస్ లో వున్నప్పుడు చంద్రబాబు వ్యతిరేకత అన్న తాడు పట్టుకుని క్షేమంగా తమ రాజకీయం చేసుకున్నారు. దీంతో విభజన తర్వాత టీడీపీ లో చేరడానికి వీరికి మొహం చెల్లలేదు. ఇక వైసీపీ లో చేరదామంటే ఇక సీఎం కుర్చీలో కూర్చోవడమే ఆలస్యం అన్నట్టు వ్యవహరించిన జగన్ వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఏ గతి లేక ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ లేదు అని తెలిసినా ఈ బ్యాచ్ అంతా కట్టగట్టుకుని బీజేపీ లో చేరారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికార పీఠం ఎక్కడం ఈ బ్యాచ్ కి ఏ మాత్రం రుచించలేదు. అయితే అప్పటికే బీజేపీ లో చేరి వున్నారు కాబట్టి ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్రం నుంచి చంద్రబాబు సర్కార్ కి సహాయం అందకుండా అడ్డుపడ్డారు. నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని తెలిసినా చంద్రబాబు మీద కోపం , తమ ఇగో చల్లార్చుకోడానికి రాష్ట్ర ప్రయోజనాలను అధిష్ఠానం మెప్పు కోసం తాకట్టు పెట్టారు. 

2014 ఎన్నికలు ఫలితాలు పాతబడిపోగానే వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బీజేపీ , టీడీపీ బంధాన్ని తెగ్గొట్టి వైసీపీ తో పొత్తు కుదర్చడానికి సిద్ధపడ్డారు. అక్కడా దాదాపు సక్సెస్ అయ్యారు. పోలవరం ఆపడానికి కూడా ట్రై చేశారు. వీళ్ళ శాడిజం నిన్న జైట్లీ బడ్జెట్ చదువుతుంటే ఇంకాస్త పెరిగిపోయింది. ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంటే అక్కడే పుట్టి ఆ గాలి,నీరు పీల్చిన కృతజ్ఞత అయినా లేకుండా చంద్రబాబు మీద కసి తీరిందని మొహాల మీద వికటాట్టహాసంతో కనిపించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాగానే ఓ నాయకుడు , ఓ నాయకురాలు ఇదే విషయం మీద మాట్లాడుకుని తెగ పొంగిపోయారట. వీళ్ళ ఉత్సాహం చూసిన ఓ అసిస్టెంట్ సైతం ఛీ వీళ్లా మన నాయకులు అని చీదరించుకున్నారట. 
అయితే తమ ముందు కాదు కదా వెనుక ఏమి అనుకుంటే ఏమి అనుకునే బ్యాచ్ కి కొద్దిసేపట్లోనే అంటే మొహాల మీద వికటాట్టహాసం చెరిగిపోయే లోపే ఓ విషయం గుర్తు వచ్చి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు ఫీల్ అయ్యారంట. ఈ బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అన్న మాట ఎత్తితే పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఇక టీడీపీ పొత్తుండదు. వైసీపీ తో పొత్తు ఉంటుందో ,లేదో తెలియదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కెసిఆర్ లాగా ఎన్నికలు దగ్గర పడగానే బీజేపీ కి జగన్ ఝలక్ ఇస్తే తమకు రాజకీయంగా పుట్టగతులు వుండవు. ఇవన్నీ తలచుకుంటే కాళ్ళ కింద భూమి కంపంచిందట ఆ బ్యాచ్ మొత్తానికి. అవసరం తీరాక అద్వానీ అంతటివాడినే పక్కనపెట్టిన మోడీ పనికిరారు అనుకుంటే తమని ఎంత దూరం పెడతారో ఈ నేతలకు తెలియదా ఏంటి …అందుకే చెరపకురా చెడేవు అన్నది.