నితిన్ హీరోగా ప్రస్తుతం రెండు మూవీ లు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి వెంకీ కుడుముల తీస్తున్న రాబిన్ హుడ్ కాగా మరొకటి వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న మూవీ తమ్ముడు. కాగా తమ్ముడు యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమా గా తెరకెక్కుతుండగా దీని షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది . ఈ సినిమా లో నితిన్ కు సోదరిగా కీలక పాత్రలో లయ నటిస్తుండగా దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం తమ్ముడు మూవీ కు సంబంధించి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రూ. 8 కోట్ల వ్యయంతో భారీ యాక్షన్ ఎపిసోడ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంగా పది రోజుల పాటు చిత్రీకరించనున్నారట. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో తమ్ముడుమూవీ గురించిన ఒక్కొక్క అప్డేట్ వరుసగా రానున్నాయి.