ఎప్పుడూ చాలా ఫీస్ గా ఉంటే ఆ ఇంట్లో ఉన్నట్లుండి భయానకమైన వాతావరణం కమ్మింది. సైలెంట్‌గా ఉన్న కొడుకు సైకోలా మారిపోయాడు. తండ్రి గొంతు కొరికి.. జననంగాలు కట్ చేసి అతి దారుణంగా చంపేశాడు. అసలు ఏం జరిగిందంటే.. వారిద్దరూ తండ్రీ కొడుకులు.. కొడుకు వయసు 25 ఏళ్లు. తండ్రి వయసు 55 ఏళ్లు. ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. కానీ.. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు కాస్త చాలా భయకంపితంగా మారింది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న కొడుకు చాలా కర్కశంగా మారాడు. ఉన్నట్టుండి ఉన్మాదిలా మారి కన్నతండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. కాగా ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది అంటే… నాగపూర్ లో నివసిస్తున్న 25 ఏళ్ల విక్రమ్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి పేరు విజయ్. తాజాగా రాత్రిపూట విక్రమ్ ఓ ఉన్నాదిలా మారిపోయాడు. తండ్రిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. అతడు గొంతును బలంగా కొరికేశాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. దాంతో తండ్రి అక్కడే పడిపోయాడు. అలా ఉన్న తండ్రిని ఈడ్చుకెళ్లిన కొడుకు వరండాలో పడేశాడు.
కత్తితో కన్నతండ్రి జననావయవాలు కోసేశాడు. దీంతో కొడకు చేతిలో దారుణానికి గురైన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇటువంటి భయానక దృశ్యాల్ని కళ్లారా చూసిన తల్లి, సోదరి షాక్‌కు గురయ్యారు. విక్రమ్ ఎందుకిలా చేశాడో వారికి కూడా అర్థం కాలేదు. అడ్డుకొనేందుకు వెళ్లడంతో వారిని కూడా బెదిరించేశాడు కాగా హత్య చేస్తున్నప్పుడు విక్రాంత్ సినిమా డైలాగులు చెప్తూ..
దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొనేందుకు ఐదుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. హుదుకేశ్వర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.