హైదరాబాద్: ‘‘రేవంత్ అన్నా .. మీతో మాట్లాడాలి’’ అంటూ ఓ మహిళ సీఎంను అభ్యర్థించారు. యశోద ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ను (KCR) సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి వెళ్తుండగా.. తమ సమస్యను పరిష్కరించాలని సదరు మహిళ సీఎంను కోరారు. వెంటనే
స్పందించిన ఆయన.. ఆమె దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు ఆస్పత్రికి సం బంధించిన ఖర్చు చాలా అవుతోందని.. సాయం చేయాలని
కోరారు. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.