యముడిగా మారిన కుక్క: విధుల్లోకి వెళ్తుండగా… హోం గార్డు మృతి

కరోనా వైరస్ కారణంగా నిత్యం ఏదో చోట దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్  నేపథ్యంలో ఏపీ-తెలంగాణ బోర్డర్ వద్ద విధులు నిర్వర్తించేందుకు వెళ్తోన్న హోంగార్డు దుర్మరణం చెందారు. బైక్ అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొనడంతో తీవ్రగాయాలపాలైన హోంగార్డును మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

అయితే కరోనా నేపథ్యంలో పిట్టలవానిపాలెం మండలానికి చెందిన శ్రీనివాసరావు, నారాయణస్వామి అనే ఇద్దరు హోంగార్డులకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల బోర్డర్ పోలీస్ చెక్‌పోస్టు వద్ద డ్యూటీ కోసం వెళ్లారు. అలా విధులకు బైక్‌పై వస్తుండగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనే ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోగా తీవ్రగాయాల పాలయ్యారు.

కాగా చెక్‌పోస్టుకు సమీపంలోని శ్రీనగర్-పొందుగుల గ్రామాల మధ్య ఈ ఘోరంగా జరిగింది. వెంటనే తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హోంగార్డు నారాయణస్వామిని గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు.