ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు కిషన్ రెడ్డి. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాపన దినోత్సవంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. అనంతరం మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాము.. అయోధ్య లో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేయాలని అద్వానీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీర్మానం చేశాము, ట్రిబుల్ తలాక్ రద్దు చేసామని వెల్లడించాడు .
దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కోసం మోడీ సర్కార్ పని చేస్తుంది..దేశం విశ్వ గురువు కావాలని కోరారు. ప్రధాని విశ్వ నేతగా మార్గ నిర్దేశనం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటి నినాదం ఈ సారి 400 సీట్లు… మరో సారి ప్రధాని మోడీ నే కావాలన్నారు. BRS పార్టీ కనుమరుగు అయిపోతుంది … కాంగ్రెస్ మాత్రం ఇక పెరిగే అవకాశం లేదని సెటైర్లు పేల్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ లను వంద రోజుల్లో అమలు చేస్తానని కూడా అన్నావు కదా… ఏ మొఖం పెట్టుకుని తెలంగాణకి వస్తావని రాహుల్ గాంధీపై ఫుల్ ఫైర్ అయ్యారు.