యావత్‌ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి వైపు

అమరావతిరైతులకు భరోసా ఇస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

యావత్‌ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునఃప్రారంభంపై కేంద్రీకృతమైంది. ఐదేళ్లక్రితం అట్టహాసంగా మొదలై.. ఆ తర్వాత అర్ధాంతంగా నిలిచిపోయిన అమరావతి పనులు.. మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలు.. మోదీ బహిరంగ సభ వరకు.. ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.