కన్న కొడుకును దారుణంగా చంపేశాడు ఈ కసాయి తండ్రి. కళ్ళల్లో కారంపొడి జల్లి తల మీద రోకలి బండతో కొట్టి కొడుకును చంపేశాడు. పూర్తి వివరాల్లోకు వెళితే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధి లో ఇది జరిగింది .చింతకుంట గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివ సాయి హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు
అయితే వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి అని వెళ్ళాడు . శివ సాయిని కన్నతండ్రి శ్రీనివాస్ ఈరోజు ఎవరూ లేని సమయం చూసుకొని అతి దారుణంగా చంపేశాడు. కళ్ళల్లో కారంపొడి చల్లి రోకలిబండతో తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే శివ సాయి చనిపోయాడు తల్లి ఉపాధి పని కు అని వెళ్ళగా కొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఈ ఘాతకానికు పాల్పడ్డాడు. తర్వాత నిందితుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు .