లాక్ డౌన్ తో అన్నీ సమస్యలను తెచ్చిపెడుతోంది. వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువుల యథేచ్ఛగా రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులో చిరుత చుక్క లు చూపించింది. మైలార్ దేవపల్లిలో ఈరోజు ఉదయం రోడ్డుపై దర్జాగా పడుకొని కనిపించిన చిరుత అధికారులు అక్కడికి చేరుకునే లోపే అక్కడి నుంచి పక్కకు జారుకొంది. చాలా సేపు అక్కడ మైలార్ దేవపల్లిలోని కాటేదాన్ ప్రాంతాల్లో అది నక్కి ఉన్నట్టుగా అనుమానించి దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసు డిపార్ట్ మెంట్. అలానే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అటవీ శాఖ జూ పార్కు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో తప్పించుకొని సమీపంలో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కు సంబంధించిన సైట్ లోకి వెళ్లింది. ఆ ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఆ చిరుత గాయపరిచింది.
అసలేం జరిగింది అంటే.. ఈరోజు హైదరాబాద్ లోని రెండు చోట్ల చిరుతలు కలకలం రేపాయి. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కర్నూల్ రోడ్డు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద చిరుత కలకలం సృష్టించింది. దీంతో ఇరువైపుల రోడ్లను బ్లాక్ చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే పులిని పట్టుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత ఎన్హెచ్ 7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది. అలాగే.. చిరుతకు గాయాలు కావడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో హైవేపై ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఆ చిరుతను చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిది లని ఫతేదర్వాజ ప్రాంతంలో బ్లాక్ పాంతర్(చిరుత) సంచరిస్తుందంటూ కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు వలపన్ని పట్టుకుని జూ పార్కు కు తరలిస్తున్నారు. అయితే అది బ్లాక్ పాంతర్(చిరుత) కాదని సివెట్ క్యాట్(గండు పిల్లి) అని అధికారులు గుర్తించారు. అయితే అందుకు తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని జూపార్కులో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. కాగా స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.