మీడియా అతికి మరో నిదర్శనం

The Media Is Yet Another Evidence In Kelvin Image

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హైదరాబాద్ డ్రగ్స్ కేసు మీడియాకు అయాచిత వరంలా మారింది. ఎంతగా అంటే రాష్ట్రపతి ఎన్నికల కవరేజ్ కంటే డ్రగ్స్ కవరేజే ఎక్కువైంది. దీనికి తోడు రోజుకో సినీ సెలబ్రిటీ ఎక్సైజ్ ఆఫీస్ కు వస్తుండటంతో.. మీడియాకు పండగైంది. రోజుకో రకంగా కథనాలు వండి వారుస్తూ టీఆర్పీలు పెంచుకోవడానికి మంచి టైమ్ దొరికింది. అయితే ఈ అత్యుత్సాహంలో చేసిన పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్. కెల్విన్ అరెస్టుతోనే డ్రగ్స్ తో టాలీవుడ్ లింకులు బయటపడ్డాయి.అతడిచ్చిన సమాచారంతోనే ఎక్సైజ్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించి సినీప్రముఖుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ కు కెల్విన్ వచ్చాడని, ఆ ఫంక్షన్ ఫోటోల్లో కెల్విన్ ను అధికారులు గుర్తించారని ప్రచారం జరిగింది.

దీంతో అసలు ఫోటో ఏదో తెలుసుకోకుండానే మీడియా మాత్రం రెచ్చిపోయి.. రెడ్ అండ్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తే కెల్విన్ అని తెగ ప్రచారం చేసింది. అయితే తాను కెల్విన్ కాదని, బెంగళూరుకు చెందిన నాగబాబునని సదరు వ్యక్తి ఛానెళ్లకు ఫోన్ చేశాడు. తన ఫోటోను బద్నాం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

మరిన్ని వార్తలు:

కేసీఆర్ ఎందుకు చేసినా.. బాబుకు అనుకూలమే..?

దిలీప్ బుక్కయినట్లేనా..?