జమ్మూ కాశ్మీర్, POK లో ఉగ్ర సంస్థలు.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహెల్‌గామ్ ఉగ్ర దాడి, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిలపక్షానికి వివరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.





