ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు కల్లెం వేసేందుకు ఆ దేశ వార్తా సంస్థ ఒకటి తీవ్రంగా ప్రయత్నించింది. కొరియాలో జరిగిన ఓ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కు ఆయన హాజరైనట్టు వీడియో ద్వారా తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు అతడి సోదరి కూడా హాజరైనట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఆ వీడియో ఆదేశ అధికారిక మీడియా సంస్థ తప్ప మిగతావి ఏవీ ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కాగా గత కొద్ది రోజులుగా కిమ్ ఆరోగ్యం విషమించింది అంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఒక దశలో అయితే ఏకంగా కిమ్ మృతి అంటూ కూడా వార్త ట్రెండ్ అయ్యింది. అందుకు కారణం లేకపోలేదు. గుండె ఆపరేషన్ తర్వాత కిమ్ మీడియా ముందుకు రాకపోవడమే. అయితే కిమ్ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కి వచ్చిన వార్త ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) మాత్రమే వెల్లడించింది. ఆ వీడియోలో కిమ్ రాక చూసిన ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు. తమ దేశ అధ్యక్షున్ని చూసి హురేయ్ అం అంటూ అరుస్తున్నారు. అయితే ఈ వార్తను ఇతర మీడియా సంస్థలు ఏవీ కూడా అధికారికంగా వెల్లడించకపోవడంతో ఇంకా పలు అనుమానాలకు దారి తీస్తోంది.