Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
The TRS Party Claims To Be Own Proud Of Its Party
టీఆర్ఎస్ నేతలకు ఈ మధ్య సొంత డబ్బా బాగా అలవాటైపోయింది. నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం అమలు కాగానే.. తామే ముందుగా మద్దతిచ్చామన్నారు. ఇక బంగారంపై లిమిటేషన్ వార్తలు రాగానే.. అది వద్దని ముందే ప్రధానికి చెప్పామన్నారు. చివరకు అలాంటి నిర్ణయం లేకపోవడంతో అది తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు తెరపైకి రాగానే.. కేసీఆర్ సలహా ఇచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారు.
అసలు గులాబీ నేతల బాథేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాల బాథ లేదు. ఏం చేసినా అడిగేవాడు లేడు. అయినా సరే చీప్ పబ్లిసిటీ కోసం పాకులాట ఎందుకని టీఆర్ఎస్ నేతల్లోనే ఓ వర్గం వాదిస్తోందట. ప్రతి దానికీ మేమే చెప్పాం, మేమే చేశాం అంటే ప్రజల్లో పలుచనౌతామని, ఇప్పటికైనా ఇలాంటి ఎటకారాలు మానుకోమని కేసీఆర్ కు చెబుతున్నారట.
కానీ కేసీఆర్ ఎవరి మాటా వినే రకం కాదని అందరికీ తెలుసు. ఆయన ఏమనుకుంటే అదే చేస్తారు. అందుకే సొంత డబ్బాని ఇంకా ప్రోత్సహిస్తున్నారట. మోడీతో గతంలోనే కేసీఆర్ దళితుడైతే బాగుంటుందని చెప్పారని, అందుకే మోడీ ఫోన్ చేసి, మీ సూచన మేరకే దళితుడ్ని ఎంపిక చేశామన్నారని టీఆర్ఎస్ నేతల మాటల సారాంశం. కానీ మోడీ అర్థంలో మీ సూచనలు అంటే.. విపక్షాల సూచనలు అని వీళ్లకు ఎప్పుడు అర్థమౌతుందో ఆ దేవుడికే తెలియాలి.
మరిన్ని వార్తలు: