వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర..నేటికి 11వ రోజుకు చేరింది. ఇక ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో అతిధులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు.
అటు పాలకొల్లులో జరుగనున్న బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి, కొట్టు, విడదల రజనీ.. అలాగే, సాలూరు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్నదొరలు హాజరు కానున్నారు.
అటు జగనన్న సురక్ష కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 10032 గ్రామ సచివాలయాల్లో 98%, వార్డు సచివాలయాల్లో 77% వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయింది. క్యాంపులు ముగిసే మరో వారం రోజుల్లో 100% పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా, 85,000 మంది పేషంట్లను రిఫరల్ ఆసుపత్రులకు పంపించారు. వీరికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు వైద్యానికి సాయం అందించనుంది ప్రభుత్వం.