సినిమా ప్రేమికులకు శుభవార్తే.. లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి మూతపడిన సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిహాల్స్, షాపింగ్ మాల్స్ వంటివి మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే.. జన సమూహాలు ఎక్కువగా ఉండే జంక్షన్ లలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి మూడు జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. రెడ్ జోన్ పరిధిలో కఠిన నిబంధలు అమలు చేస్తూ…ఆరెంజ్ జోన్లో కొంత మేర సడలింపు నిచ్చింది ప్రభుత్వం.
అందుకు సంబంధించి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను మెల్లిమెల్లిగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే… ఈ నెల 18వ తేది నుంచి సినిమా థియేటర్లకు కూడా అనుమతించే అవకాశం ఉంది అనే టాక్ నడుస్తోంది. ఇంకా లాక్డౌన్ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించే దిశగా ప్రణాళికలను రెడీ చేస్తుంది. ఈనెల 18నుంచి గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ మినహా గ్రీన్ జోన్ లో మూడు ఆటలకు అనుమతులివ్వనుంది ప్రభుత్వం.
అంతేకాకుండా రాత్రి 7 గంటలలోపు మూడు ఆటలు పూర్తి కావాలనే నిబంధన విధించనుందనే టాకా కూడా వినిపిస్తోంది. అలాగే సినిమా హాల్స్ లో సీటుకి సీటు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలని సూచించనుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని నిబంధన విధించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. గ్రీన్ జోన్స్ లోని మాల్స్ లలో కూడా ఇదే తరహా నిబందనలు అమలు చేయనుంది ప్రభుత్వం. కాగా షాపింగ్ మాల్స్ కూడా సాయంత్రం 6 గంటల లోగా మూసివేయాలని ప్రభుత్వం సూచించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.