మాజీ సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది..

YS Jagan
YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పంచాయితీ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా ఆయనకు సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆరోపిస్తుంటే.. ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా? అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. అయితే వైసీపీ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు భద్రత లేదనడం డ్రామా అని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని.. ఎన్నికల కోడ్ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. జగన్ ఎమ్మెల్యే మాత్రమే అని.. ఆయన ప్రతిపక్ష నేత కాదని మంత్రి సుభాష్ అన్నారు.