బాబోయ్‌.. భాగమతితో పోటీ వద్దులే!

there-is-no-competation-for-bhagmathi-movie
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

సంక్రాంతి సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జైసింహా’, రాజ్‌ తరుణ్‌ ‘రంగుల రాట్నం’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతి సీజన్‌కు ఎప్పుడైనా ఎక్కువ సినిమాలు విడుదల అయ్యి, ఆ తర్వాత రిపబ్లిక్‌ డేకు ఒకటి లేదా రెండు సినిమాలు వచ్చేవి. కాని ఈసారి మాత్రం సంక్రాంతికి మూడు సినిమాలు రాబోతుండగా, రిపబ్లిక్‌ డే సందర్బంగా ఏకంగా ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రెండు చిత్రాలు పెద్దవి కాగా మిగిలిన నాలుగు సినిమాు ఒక మోస్తరు నుండి చిన్న బడ్జెట్‌ చిత్రాలు. రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల కాబోతున్న చిత్రాల్లో ప్రధమంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘భాగమతి’. రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది.

‘భాగమతి’పై అంచనాలు భారీగానే ఉన్నా కూడా పలు సినిమాలు దాంతో ఢీ కొట్టేందుకు సిద్ద అయ్యాయి. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సందీప్‌ కిషన్‌ ‘మనసుకు నచ్చింది’, విశాల్‌ ‘అభిమన్యుడు’, రాజరథం, దండుపాళ్యం 3చిత్రాలు 25, 26వ తేదీల్లో విడుదలకు సిద్దం అవుతున్నాయి. తాజాగా ‘భాగమతి’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ‘భాగమతి’ ట్రైలర్‌ చూస్తుంటే అరుంధతి రేంజ్‌లో ఉండబోతుందని, అనుష్క డబుల్‌ రోల్‌తో రెచ్చి పోవడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.

ఈ చిత్రంకు పోటీ విడుదల అవ్వడం ఆత్మహత్యతో సమానం అని రెండు మూడు సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ముందుగా నిర్ణయించబడ్డ మూడు చిత్రాల విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం మాత్రం ఫైనల్‌ బరిలో ఉండే అవకాశం ఉంది. విష్ణు చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం పది రోజుల్లో రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల అవ్వబోతున్న సినిమాల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.