అంతలోనే అంత లేదన్న పవన్.

There Is No Political Reasons For moving Close With CBN Says Pawan

వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో చంద్రబాబుతో మాటలు కలిపిన పవన్ ఎన్నో పుకార్లకు తెర లేపారు. గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో ఆ ఇద్దరూ 15 నిమిషాలకు పైగా గడపడం ఎన్నో ఊహలకు దారి తీసింది. పాత మిత్రత్వం మళ్లీ మొగ్గ తొడిగిందేమో అన్న సందేహాలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ సందేహాలకు అంతలోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఇతర పార్టీలకు చెందినవారితో ఏదో ఓ కార్యక్రమంలో మాట్లాడినంత మాత్రాన ఆ ప్రభావం రాజకీయాల మీద ఉండబోదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఓ విధంగా చంద్రబాబుతో మళ్లీ జత కట్టే ప్రశ్న లేదని చెప్పకనే చెప్పారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ట్వీట్ సారాంశం ఏంటో మీరే చూడండి…