“భారీ డిస్కౌంట్ సేల్“తో జర భద్రం

“భారీ డిస్కౌంట్ సేల్ “తో జర భద్రం

e-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్,ఫ్లిప్కార్ట్ లు పండగల సందర్బంగా గ్రేట్ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్  డేస్ పేరిట 50నుండి 80శాతం వరకి భారీడిస్కౌంట్ ఇస్తున్నాయి.ఈ ఉత్పత్తులు కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

  • ఏ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ఉందో చూసి ఆ బ్యాంక్ కార్డ్ తో కొనడం మంచిది. కొనుగోలు చేయడానికి ఉపయోగించే బ్యాంకు కార్డును బట్టి డిస్కౌంట్ మారుతూ ఉంటుంది.
  • ఈ-కామర్స్ వెబ్సైట్లో కన్నా కంపెనీ అధికారిక వెబ్సైట్లో స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఎక్కువగా తెలసుకవచ్చు. కాబట్టి అధికారిక వెబ్ సైట్ ను కూడా చూసి కొనడం ఎంతో శ్రేయస్కరం .
  • విక్రయించే సంస్థలకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్ కూడా చూసి కొనాలి.
  • సెక్యూర్డ్ కాని వెబ్సైట్లలో కొనకూడదు.వెబ్సైట్ యూఆర్ఎల్ లో https లేకపోతే అది నకిలీ వెబ్సైటు.
  • వ్యారెంటీ ఎన్నిరోజులు ఉంటుందనే విషయం కూడా గమనించాలి.మిగతా సైట్లలో ధరలను పోల్చి కొనుగోలు చేయండి.