సిటీ బస్సులో ప్రయాణిస్తున్నవారిరే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. కొన్ని రోజలు క్రితం బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేసి పరారయ్యారు నిందితులు. బస్సు దిగే సమయంలో ప్రయాణికుడి చేతిలో ఉన్న మొబైల్‌ని ఒక వ్యక్తి లాక్కున్నాడు. ఆ తర్వాత వెంటనే ద్విచక్ర వాహనం మీద మరొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని బండిపై పరారయ్యార్రు . చేసేదేమీ లేక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశాడు.
రద్దీగా ఉన్నటువంటి బస్సులు.. పబ్లిక్ ప్రదేశాలే వారి లక్ష్యం.. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా అంతే సంగతి.. దొరికిన కాడికి దోచుకుని వెళ్లి పోతున్నారు . అవును, హైదరాబాద్ మహా నగరంలో విపరీతంగా చోరీలు పెరిగిపోతున్నాయి. తమ పర్సు పోయిందని, మొబైల్ ఫోన్ పోయిందని, ఇలా తరచూ ప్రతి పోలీస్ స్టేషన్లలో వందలాది కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో ప్రజలు ఏ కొంచెం అజాగ్రత్త వహించినా తమ విలువైన వస్తువులు పోవడం ఖాయం అని అంటున్నారు పోలీసులు.. రెగ్యులర్‌గా దొంగతనాలకు పాల్పడే హ్యబిచువల్ అఫెండర్స్ ముందుగా తమకు అనుకూలంగా ఉండే ఆయా ప్రాంతాలను ముందే
ఎంచుకుంటారు.. ఆ తర్వాత పబ్లిక్‌లో తాము ఒకరమంటూ నటిస్తారు. ఎవరైతే హడావిడిగా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు .. తర్వాత దొరికినంత దోచుకుని మాయమై పోతారు.
తాజాగా మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ గోల్డ్ చైన్ కొట్టేశారు దొంగలు. బస్సు ఎక్కి దిగే లోపు గోల్డ్ చైన్ అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు . అనంతరం చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు కూడా చేశాడు మహేశ్వరం మండలానికి చెందిన రాజశేఖర్. టిఎస్పిఎస్సి మూడవ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు రాజశేఖర్. శుక్రవారం నాడు సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుండి మైత్రివనం వెళ్లేందుకు సిటీ బస్సు ఎక్కారు . అనంతరం దిగి చూసేసరికి గోల్డ్ చైన్ కనిపించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
కాగా, ఈ మధ్యకాలంలో సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వారినే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. సదరు బాధిత ప్రయాణికుడు. ఈ విధంగా తరచూ ఎక్కో ఒక దగ్గర చోరీలు నమోదు అవ్వడంతో వందలాది కేసులు ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు అవుతున్నాయి. అయితే బస్సులలో ప్రతి ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, అప్రమత్తంగా లేకపోతే నష్టపోక తప్పదంటూన్నారు సిటీ పోలీసులు.