Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Third-Degree Inquiry In Sheena Bora Murder Case
దేశవ్యాప్తంగా కలకలం రేపిలో సొంత తల్లి ఇంద్రాణి అరెస్టై.. జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఇంద్రాణి చేస్తున్న దౌర్జన్యాలకు జైల్లో ఆమెను బాగా కొడుతున్నారని తెలుస్తోంది. ఇంద్రాణి జైలు అధికారి చేతిలో ఇప్పటికే ఓ మహిళా ఖైదీ మరణించడం ఆ అనుమానాల్ని మరింత పెంచుతోంది. అసలు సదరు జైల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కుమార్తెను హత్య చేయించిన నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి కేసులో కొత్త మలుపు కనిపించింది. బైకుల్లా జైల్లో ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారని ఆమె లాయర్ కోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. దీంతో జైల్లో అసలేం జరిగిందోనని అందరూ అనుమానిస్తున్నారు. బైకుల్లా జైలు నుంచి ఇంద్రాణిని ఓ సారి తమకు కోర్టుకు తీసుకొచ్చి చూపించాలని న్యాయమూర్తి ఆదేశించడం సంచలనం కలిగిస్తోంది.
జైలు అధిపతి మనీషా పోకార్కర్ చేతిలో ఇప్పటికే ఓ ఖైదీ మరణించారని, ఇప్పుడు ఇంద్రాణి ఒంటి మీద కూడా తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయని లాయర్ అంటున్నారు. మరి క్రిమినల్ మైండ్ ఉన్న ఇంద్రాణిని నిజంగానే జైలర్ కొట్టారా.. లేదంటే బెయిల్ కోసం ఆమే నాటకమాడుతున్నారా అనేది తేలాల్సి ఉంది. జైలు అధికారులు కూడా పరపతిని పట్టి ఖైదీలతో నడుచుకుంటారు.. అలాంటిది ఇంద్రాణిని కొట్టారంటే నమ్మశక్యం కావడం లేదంటున్నాయి పోలీస్ వర్గాలు.
మరిన్ని వార్తలు: