ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు : సూపర్ స్టార్ మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమా షూటింగ్ లో భాగంగా నిత్యం బిజీగా గడిపే మహేష్ ఏమాత్రం సమయం దొరికినా.. కుటుంబంతో కలిసి విదేశాలకు చెక్కేసి ఎంచక్కా.. ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఇక్కడైతో ఫ్యాన్స్ తో సమస్యలు స్వేచ్ఛకు తిరగనీయరని..వారి ఆలోచన.

అయితే మహేశ్ బాబు సహజంగా తన ఫ్యామిలీతో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా సోష‌ల్ మీడియో ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా త‌న ట్వీట్ ద్వారా త‌ల్లి ఇందిరాదేవికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అందించారు మ‌హేష్‌. నా జీవితంలో అత్యంత ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి పుట్టిన రోజు ఈరోజు. అందుకే ఈరోజు నాకు చాలా ప్ర‌త్యేకం అని అన్నారు మ‌హేష్‌ బాబు.

అదేవిధంగా కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరతో వివాహమైంది. ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు అవుతుంది. సొంత మరదలినే కృష్ణ 1961లో పెళ్లి చేసుకున్నాడు.1965 అక్టోబర్ 13వ తేదీ నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసి.. ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

అంతేకాకుండా కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తుంది. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే.