జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్ లక్ష్మణరావుకు పవన్ అండగా నిలిచారు. వారాహి యాత్ర ఈ నెల 10న విశాఖలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని జీవీఎంసీ చెత్త వాహనం డ్రైవర్ మైక్ లో ప్రచారం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభుత్వం విధుల నుంచి డ్రైవర్ ను తొలగించింది. అయితే పవన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు త్వరలో ఉద్యోగం కల్పిస్తానని సదరు డ్రైవర్ కు హామీ ఇచ్చారు.
GVMC పరిధిలోని.. 37 వ డివిజన్లో చెత్త తరలించే వాహనానికి కాంట్రాక్ట్ డ్రైవర్ గా లక్ష్మణరావు అని వ్యక్తి పని చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. వారహి యాత్ర గురించి ప్రచారం చేస్తే తన ఉద్యోగం పోతుందని తెలిసి కూడా చెత్త వాహనానికి ఉన్న మైక్ ద్వారా ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు.
విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్మణరావును ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. 50 వేల రూపాయలు విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆర్థిక సహాయం చేశారు. త్వరలో ఉద్యోగం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. .లక్ష్మణ్ రావు తనపై ఇంతటి అభిమానాన్ని చూపించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై జనసైనికులు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. మీ నాయకుడు ఉద్యోగం తీస్తే.. మా నాయకుడు అండగా నిలిచాడని.. జగన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.. ఇప్పుడు ఇవే వైరల్ గా మారుతున్నాయి.