లండన్: సౌతాఫ్రికా సీనియర్ క్రికెటర్లు ఇమ్రాన్ తాహిర్, జేపీ డుమిని ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతామని టోర్నీ ఆరంభానికి ముందే ప్రకటించారు. చెత్త ప్రదర్శనతో అన్ని రంగాల్లో విఫలమైన సౌతాఫ్రికా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. నాకౌట్ చేరిన ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఓడించి ఇద్దరు ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని డుప్లెసిస్‌సేన భావిస్తోంది.
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. స్పిన్ ఆల్‌రౌండర్ డుమిని దక్షిణాఫ్రికా తరఫున 2011, 2015 వరల్డ్‌కప్‌లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. వెటరన్ ఆటగాళ్లకు ఇది మూడో టోర్నీ కావడం విశేషం. బంగ్లాతో మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.