గత వారాలకి భిన్నంగా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియ చేపట్టాడు. కెప్టెన్ శ్రీముఖి మినహా మిగతా ఇంట్లోని 8 మంది కంటెస్టంట్స్ రాత్రి పగలు తేడా లేకుండా నామినేషన్ నుంచి తప్పుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్ ఆడుతున్నారు. సోమవారం ఎపిసోడ్ లో మొదలైన ఈ టాస్క్ మంగళవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. ఈ టాస్క్ లో కంటెస్టంట్స్ సామాన్య జీవితం గడుపుతూ…వర్షం రూపంలో పడే 20 – 50 – 100 – 200 విలువ చేసే రాళ్లని పట్టుకుని దాచుకోవాలి. ఇందులో నాలుగు బజర్లు మ్రోగుతాయి.
బజర్ మ్రోగిన ప్రతిసారి శ్రీముఖి కంటెస్టంట్స్ దగ్గరున్న రాళ్లని లెక్కిస్తుంది. ఎవరి దగ్గరైతే తక్కువ రాళ్ళు ఉంటాయో వారు ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారు. సోమవారం ఎపిసోడ్ లో తక్కువ రాళ్ళు గల రాహుల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం ఎపిసోడ్ లో రాళ్ళ వర్షం పడగా..కంటెస్టంట్స్ వాటిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన దగ్గర తక్కువ రాళ్ళు ఉన్నాయని ఒక 200 విలువ చేసే రాయి అప్పు ఇవ్వమని మహేష్ అలీని బ్రతిమలాడాడు.
‘నీ దగ్గర ఎలాగో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి…కాబట్టి నామినేట్ కావని – అందుకే తనకు అప్పుగా 200 ఇస్తే – నెక్స్ట్ మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే అలీ మాత్రం ఇంకోసారి రాళ్ళ వర్షం పడినప్పుడు ఇస్తానని – ఇప్పుడు ఇస్తే తాను బుక్ అయితే ఇబ్బంది అని మాట్లాడాడు. కానీ నెక్స్ట్ రాళ్ళ వర్షం పడకుండా హఠాత్తుగా టాస్క్ లో రెండో బజర్ మ్రోగింది.
దీంతో శ్రీముఖి కంటెస్టంట్స్ దగ్గర ఉన్న రాళ్ళ విలువని లెక్కించింది. అయితే ఇందులో మహేష్ దగ్గర అందరికంటే తక్కువ విలువ ఉండటంతో ఈ వారం నేరుగా నామినేట్ అయ్యాడు. ఒకవేళ అలీ 200 విలువ గల రాయి ఇచ్చి హెల్ప్ చేసి ఉంటే మహేష్ సేవ్ అయ్యేవాడు. ఎందుకంటే మహేష్ కంటే ఒక 100 విలువ ఎక్కువ ఉండి సేఫ్ అయిన పునర్నవి నామినేట్ అయ్యేది. ఆ తర్వాత కూడా ఇదే ప్రాసెస్ జరగగా వరుసగా పునర్నవి – వరుణ్ నామినేట్ అయ్యారు. మొత్తం మీద ఈ వారం రాహుల్ – మహేష్ – పునర్నవి – వరుణ్ లు నామినేట్ అయ్యారు.