ఏది కొత్తగా మార్కెట్ లోకి వస్తే దాని వెంట పడి అంతు తేల్చడం మానవుని నైజం. ఇప్పడు సమాజాన్నే టిక్ టాక్ ఊపేస్తుంది. తాజాగా ఓ యువకుడు టిక్ టాక్‌కు బాగా అలవాటు పడి ప్రాణాలను తీసుకున్నాడు. అదేమంటే… అతడు రకరకాల వీడియోలు చేయడం, స్టంట్లు చేయడం, వీక్షకులు మెచ్చేలా పాటలు పాడటం వంటివి చేస్తుంటాడు.
ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందపడుతుంటాడు. వాటిపై ఉన్న పిచ్చి ఆ యువకుడి ప్రాణం తీసింది. వీడియో క్రియేటింగ్ యాప్ అయిన టిక్ టాక్‌కు బాగా బానిసైన ఆ వ్యక్తి.. తాను చేసిన వీడియోలకు లైక్‌లు రావడం లేదని ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 18 ఏళ్ల యువకుడు తీవ్రమైన మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ్డాడు. కాగా ఈ ఘటన తాజాగా నోయిడాలో చోటుచేసుకుంది.
కాగా నోయిడాలోని సాలార్పూర్కు చెందిన యువకుడు టిక్ టాక్‌కు బాగా అలవాటు పడ్డాడు. పోలీసులు, స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. అతడు రకరకాల వీడియోలు చేయడం, స్టంట్లు చేయడం, వీక్షకులు మెచ్చేలా పాటలు పాడటం వంటివి చేస్తుండేవాడు. అయితే దానికి ఎక్కువ మంది లైకులు కొట్టడం లేదని మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కాగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా టిక్ టాక్‌లో లైకులు రావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారణలో తేలినట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.